తెలంగాణ అచ్చె దిన్ -కెబిఆర్ పార్క్ కింద తొఱ్ఱ!
ఈ మధ్య నేను తెలంగాణ న్యూస్ చూసింది చాలా తక్కువ.... పుసుక్కున ఈ కెబిఆర్ పార్క్ కింద తొఱ్ఱ , అదే సొరంగం, న్యూస్ ఆకర్షించింది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రాణంగ శ్వాసించి, అనుభవించి, భావించి అంతే ఉద్వేగం తో కెసిఆర్ ను/T R S ను అభిమానించి, సపోర్ట్ చేసిన నా లాంటివాళ్లకు ఈ సొరంగం మరియు దుర్గం చెరువు మీద గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కొంత అలజడి మొదలైయ్యింది. ఫస్టు ఫస్టున Howard Zinn గుర్తొచ్చిండు.... I am only paraphrasing…..but rarely the fruits of any revolution/movement are enjoyed by the participants or the most deserving i.e., masses unless true people’s government is in control. ఈ hitech సిటీ ప్రాంతం, mindless స్పేస్, విస్తరించిన financial డిస్ట్రిక్ట్..... ఇక్కడ పనిచేసి, ఆస్తులున్న వారు మచ్చుకైనా తెలంగాణ ఉద్యమం లో ఉన్నారా? ఇంకా కొందరు దొంగ నాయాళ్ళు save హైదరాబాద్ అని ప్రొటెస్ట్ చేసిండ్రు.... ఇప్పుడు చూడుండ్రి.... మొత్తం ఫోకస్, రిసోర్సెస్ అక్కడే .... తవ్వుడు flyover లు కట్టుడు, దాని పైన ఇంకోటి , దాని పక్కన ఇంకోటి, మల్ల రోడ్ widening.... ఇంకా జనాలు ఆ చేటాక్ బ్రిడ్జి రాత్రి ఫొటోస్ పెట్టి మెరుస్తున్న హైదరాబాద్, విశ్వనగరం
హైదరాబాద్ అని యూట్యూబ్ లో పెట్టుడు అందరు సంకలు గుద్దుకోవుడు....దత్ తేరికి! ఎవరికీ మెరుపులు .... సచ్చిన 1500 ఇంట్లల్లా నిజంగా వెలుగులున్నయా.....ఆమ్మో అమరవీరులు ఆ మాటే వినపడొద్దు.... ఒక్కడే తీసుకొచ్చే మరి! నిజంగా ఆశయానికి సచ్చేటోళ్లు ఎంత అమాయకులు .....
These effin bourgeois know when the tide is turning and which naïve masses are going to kill themselves for the movement….these paper/tv/internet warriors are at the helm now suppressing any hint of dissent. Their loyalty is to the power….even a cursory look at tall the major contractors and all movers and shakers reveal one thing….they were there before and now…. just easily realigned. Just one example….what happened to Lanco towers or can we even hush hush talk about Ramoji City?
ఎన్నన్నా flyovers కట్టండి, కెబీర్ కింద మీద కింద ఎన్ని తొఱ్ఱ లన్న తొవ్వండి....కానీ రియల్ ప్రియరిటిస్ ఏవి? ఉద్యమ లక్ష్యాలు ఏవి? సింపుల్ స్టార్మ్ వాటర్ డ్రైనేజీ ఏది.... అంటే ప్రపంచంలో పెద్ద సిటీలన్నీ వర్షం పడితే మునుగుతై అని పరమ ఫాల్తు కౌంటర్ ఆర్గుమెంట్... అరె భయ్ ప్రతిసారి మునగవు... ఖచ్చితంగా remedial చర్యలు చేపడతారు.... మన స్టోరీ same to same and shame to shame. కేసీర్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే హైదరాబాద్ మూడు వైపులా 1000 బెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిపిస్త నన్నడు...ఒక extra బెడ్ అన్న add అయ్యిందా? Covid టైం లో హాస్పిటల్ లో విశృంఖలంగా డబ్బులు గుంజితే regulation అన్న మాటే లేదు.... కొంచెం పనిచేసిన రాజేందర్ ను సాగనంపిండ్రు. English మీడియం గురుకూల స్కూల్స్, మండలానికొక్కటి...ఇంకా నయం గల్లీకి ఒక్కటి అనలేదు, ఎక్కడ పాయే ? అరె ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మూస్తుండ్రు.... ఓల్డ్ సిటీ లో ఎన్నో సంవత్సరాలనుండి నడుస్తున్న స్కూల్స్ పిల్లలు లేరని, ఇంకో కుంటి సాకులు చెప్పి ఫండ్స్ లేకుండా చేస్తుండ్రు! యాదాద్రి మాత్రం 1500 crores.... ఆమ్మో దేవుడు ఏమనొద్దు... ఎవరి పైసల్ అవి తిండి తిప్పల కన్నా గుళ్ళు కావలసివొచ్చిందా.... 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పాయె? యాదాద్రి Is honestly a real estate project.... ఇది అందరికి తెలిసిన రహస్యం. ఇంకా దళితులకు మూడెకరాలు లాంటి విషయాలు తల్చుకుంటే నే సిగ్గుగా ఉంది. టీవీల/సభలల్లో అమర వీరులపై తెగ పాటలు పాడి, కన్నీళ్లు పెట్టి కాసులు దండుకున్న వీరులేరి? మా దేశపతి ఎక్కడికి పాయె, ఎడిటోరియల్స్ రాసిన కట్ట ఏమంటడు.... ఇంకా సోషల్ మీడియా అంటి -సోషల్ మీడియా చూసిన వాళ్ళు ఏమంటరు?
The nobility, sacrifice and ardor of the movement is completely co-opted by classical bourgeois, neoliberal dispensation. It greatly hurts to see the true goals of the movement are completely lost and the 5% who vehemently opposed the movement before enjoy utter primacy in policies and implementation.
అబ్బా ఒక్క ఓల్డ్ age పెన్షన్ ఇస్తే చేతులు కట్టుకొని క్రుతజ్ఞ తో నీ బాంచెన్ అని ఉండాల్నా .... అదీ expectation. ప్రభుత్వోద్యుగులకి మెడికల్ insurance వస్తుంది ..... ఆమ్మో కెసిఆర్ జేబులనుండి పైసలిచ్చే మరి.... ఇంకా వంగి వంగి ఉండాలే. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులా .... ఎంత లజ్జగా ఉంది.... నా ఉద్యమ తెలంగాణ వేరుగా ఉంటుందనుకున్న... ఈ బూటక ప్రజాస్వామ్యంలో మామూలు ప్రజలకు ఏం వొరగదు..... పోరాటం నిరంతరం, తరం తరం సాగాల్సిందే.... నీ చావు నువ్వే చావాలే అనే తత్త్వం మస్తిష్కాల్లోకి ఎక్కిస్తారు ఎప్పటిలాగానే.... కానీ చావులో, బతుకులో అందరికి అందరం అనే ఎఱుక మళ్ళీ మళ్ళీ రావాలె
Monday, June 20, 2022
Telangana-Acche Din!
Saturday, June 18, 2022
ViraataParvam
విరాట పర్వం - పర్వతం చూపని పర్వతారోహణం
భాగ్ మిల్కా భాగ్ సైన్మ టైటిల్ వస్తున్నప్పుడు మిల్కా సింగ్ ఉరుకుడు మాంటాజ్ అద్భుతంగా చూపిస్తరు.....మిల్క సింగ్ ఒక్కటే ఉరుకుడు బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లర్ బ్లర్, చివరికి అడుగులు ఎక్కడ పడుతున్నవో తెలియదు....అది టైటిల్ లో కాబట్టి థ్రిల్లింగా, అద్భుతంగా అనిపిస్తుంది. మరి సినిమా లోకి వచ్చినంక రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఇదే పద్దతిని పాటిస్తాడా...... నో .... 400 మీటర్స్ రేస్ నిజ జీవితం లో కన్నా అత్యద్భుతంగా ఆవిష్కరిస్తాడు. మొత్తం స్టేడియం, తోటి కాంపిటీటర్స్, రేస్ ట్రాక్, నేపథ్యం....ఇంక ఉరుకుడు షురూ.....టీవీ లో చూస్తనే తల్లడం మళ్లడం... మమేకం అయిపొవడమే....ఆ ఆడ్రెనలిన్ రష్ , ఉత్సాహం, వాడి , వేడి ప్రేక్షకుడికి అంతా ఇంతా కాదు! విరాట పర్వం తప్పక చూద్దామనుకున్నా ఎప్పటినుండో.... కానీ మా భరద్వాజ గారి రివ్యూ చూసి ఉండబట్టలేక ఇంకో నిశాంత్, అర్ధరాత్రి స్వతంత్రం, ఆక్రోష్ చూస్తానేమో అనే ఆశతో మొదటిరోజే కుటుంబ సమేతంగా లగెత్తుకెళ్లాను....
సినిమా గురించి ఏంతో భావోద్వేగం తో రాయాలని, చాలా ఏడవాలని, స్ఫూర్తి, కొంచమన్నా ఊరట చెందాలనుకొన్న.... కానీ అచ్చమైన ప్రేమ ఔన్నత్యం చూపెట్టే క్రమంలో, ఆ ప్రేమకు మొత్తం కారణమైన ఉద్యమ ఔన్నత్యం మొత్తానికి మొత్తమే తె ర మరుగు చేసినట్లనిపించింది . వెన్నెల ఏ ఆశయాలు, ఆలోచనల చేత ప్రభావం చెందింది.... మరి ఆ ఉద్యమం యొక్క లక్షాలు, ఆశయాలు అసలు ఆ ఉద్యమెందుకు పుట్టింది అనేది స్పృశించనే లేదే .... ఇదెక్కడి అన్నాలం!!! Only well-choreographed action sequences, cross-firing episodes is not the movement is all about?
ఒక ఫి ల్మ్ మేకర్ గాని దర్శకుడు గాని న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నా అని చెప్పడం, తనకు తానుగా అనుకోవడం కన్నా అమాయకత్వం లేదు....ఇదేమన్నా తక్కెడా ? ప్రజా పక్షం, న్యాయం పక్షం తీసుకోవాలె....లేకపోతే అగ్నిహోత్రి లాగ ఇంకో పక్షం తీసుకోవాలె! ఒక పక్షం రాజ్యం , దోపిడీ, హింస ఇంకో పక్షం ప్రతిఘటన అయినప్పుడు రెండు వాదనలకు సమాన స్థాయి ఉంటదా? ప్రాణాలు ఫణంగా పెట్టి, రాల్లు , రప్పలా మధ్య, అడవుల మధ్య తిండి తిప్పలు లేక పోరాడే వాళ్ళు, మా డ్యూటీ మేం చేస్తున్నాం అని రాజ్యం తరపున పనిచేసేవాళ్ళు ఒక్కటేనా..... Even the staunchest enemies of naxal movement cannot bring themselves to blame comrades working for their own self or material interests. Yes, naxal movement had their own weaknesses, shortcomings but they always stood for the most oppressed, the most weak and the most meek. This is the historical fact and incontrovertible truth!
ఒక ఉద్యమకారుడి/నక్సల్ అడవి జీవితాన్ని చాలా సహజంగా, వాస్తవికంగా చూపించారని ప్రశంసలు వింటున్నాం.... అక్కడ అడివి మాత్రమే వాస్తవం.... for starters all comrades look very well fed with impeccable makeup to look like real comrades…..where is the world weariness, despair as well as determination, the constant foreboding of threat? For comparison watch Che: Part Two by Steven Soderbergh when Che traverses Bolivian jungles with his handful of comrades. When they completely run out of their lil food stocks, Che looks up and says ‘kill a horse’….the movement is replete with utter despair, despondence, helplessness and yet the monumental determination to keep going forward. That Naveen’s character is an insult to any real comrade….almost flimsy behavior. At least take reference from our very own Srihari in Kubusam!
ఇది విమర్శ కాదు.... ఓన్లీ బాధే. పోలీస్ స్టేషన్ సీన్లో రామకృష్ణ తో సంవాదం abrupt గా ముగుస్తది.... Right moment to have some philosophical grappling from a common man’s perspective. But no…..again skirting about. మరి చారిత్రక సత్యాలు, వాస్తవాలు document చేసినట్లు ఎట్లవుతుంది ? నిజంగా ఆ దృక్కోణం ఉన్నట్లయితే ... should have followed 'Ramke Naam' by Anand Patwardhan. Maybe I simply had too many expectations.
ఇంకా మా భరద్వాజ గారి సుదీర్ఘ విశ్లేషణ, ఒక రకమైన నివాళి విన్నంక ఆయన చెప్పినవన్నీ విరాట పర్వంలో వెతికా .....కానీ పాండవులు దొరకనట్లు ఆ విషయాలు నాకేం దొరకలేదు. ఎదో సినిమా చరిత్ర పుస్తకంలో రాసిండ్రు....మూకీ చిత్రాల మొదలు నాటకాలకు అలవాటైన జానాలని మెప్పించటానికి తెర పక్కనే ఒక వైపు గాన , బజానా, commentary బృందం ఉండేదట . ఈ బృందం చేసే పనికి సినిమాకి పెద్ద సంభందం ఉండే అవసరం లేదని వేరే చెప్పాలా..... There’s a just a passing remark on ‘missing’ cases by Nadita Das' character….absolutely no context nor establishment of the ground reality. Cinema length cannot be a reason for ignoring such fundamental things. Also, the onset of liberalization and use of coverts by offering rewards/blandishment….the changing landscape as explained in depth by Bharadwaja gaaru is completely absent in the movie. పిల్ల మారిందా లేక నా కన్ను చెదిరిందా అనే మాయాబజార్ దవులాగు కొట్టుకోవాలనిపించింది.
When we have people like Sudha Bharadwaj right in our midst why do we need a fictional character like Nandita Das and why love angle even there? The depiction of civil liberties people was at best superficial…when the real stalwarts were of the caliber like Bala Gopal, Hara Gopal and Kannabhiran. Simply monumental personalities to be dealt so cursorily. As Ritwick Ghaatak said movies don’t need melodrama but definitely need drama….there was no sense of pain, angst, despair, helplessness when police simply abduct civil liberties leaders. Are we as audience supposed or expected to believe that these are routine things??? These are absolutely grotesque things and have to be depicted likewise…
తల్లి పాత్రలో జరీనా వాహబ్ పాత్ర బాగుంది.... హృద్యంగా ఉంది, ఎదురుచూపు, దుఃఖం, నిస్సహాయత బాగా చూపించింది. సాయి చంద్ సహజంగా, చాలా బాగా చేసిన పాత్రలో gravitas తగ్గింది... అస్సలు సరళ తండ్రి మంచి కార్యకర్త అని తెలిసినప్పుడు అయ్యో ఎందుకు ఇంత లిమిటెడ్ గా చూపించారనిపించింది. సినిమా మొదట్ల inspector సాయి పల్లవిని చూసి చేటాక్ లేవు అంటడు....అది నిజానికి రామ కృష్ణకు వర్తిస్తుంది. చేటాక్ కూడా ఉండడు కానీ powerhouse performer... His one look conveys everything….sincerity of his heart is visible in his performance. In just one scene in RRR, he easily surpassed abhinava Jai Shree Ram ‘Ram Charan’. అరే ఏందీ వయా నీ గుల్గుండేది అంటరా.... సినిమాల గొప్ప ఎం లేదా... ఎందుకు లేదు ....
The one and only Sai Pallavi. I am sure she fully understood her role and has become the role. She has the natural capacity to immerse herself, stay absolutely honest to the character and take us all on a roller coaster ride of myriad emotions. She displays vulnerability where everyone feels like it’s their bounden duty to protect her and yet remaining fiercely independent, feisty and truly revolutionary. The scene where she simply bikes to tell bava about her decision to not to marry him but join Ravanna in the forests is my favorite. And her death defying eagerness even when numbed by fear to aid in the escape at the guesthouse is marvelous…..she lived her role and became సరళ. Her smile is truly vennela….hope she escapes from the regular crass commercial movies that Chiranjeevi was so eager to offer.
అవునూ ఇది love story.... వెన్నెల దృష్టి నుండి .... కానీ వెన్నెలను ప్రభావితం చేసిన విషయాలు, ఆదర్శాలు ఎందుకు సీక్రెట్ గా ఉంచాలే... whether by design or any other constraint is immaterial. బరువైన సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు బరువుగానే తియ్యాలే.... లేకపోతె ఆత్మవంచనే. వేణు ప్రయత్నం గొప్పదే , మెచ్చుకోవాల్సిందే కానీ ఉద్యమ నేపథ్యంలో జరుగుతున్న కథకు ఉద్యమాన్నే పక్కకు పెడితే ఎట్లా చెప్పు ? చే గువేరా ప్రేమించిన యువతులు, అభిమానులు ఏంతో మంది ఉన్నారు.... వారిపై సినిమా ఎవరైనా తీసి చే ను చూపెట్టి ఆయన చేసిన పనులు, నెరపిన ఉద్యమము, ఆయన ఆశయాలు, ఉద్యమ ఆశయాల గురించి చెప్పకుండా సినిమా తీయగలరా ....అవన్నీ చెప్పకపోతే ఆ కథకు ఏం విలువ, శాశ్వతత్వం ఉంటుంది ? నీళ్లు లేకుండా పేపర్ పడవ కూడా నడవదు.... ఉద్యమం అంటే మహాసముద్రం.... అన్నీ పాత్రలు , ఉదంతాలు దాంట్లోని చేప పిల్లలే.... ఈ ఎఱుక తీసేవాళ్లకి , చూసే వాళ్లకి అవసరం!!!